Site icon Prime9

JP Nadda: జేపీనడ్డాతో హీరో నితిన్‌, క్రికెటర్‌ మిథాలీరాజ్‌ భేటీ

hero-nitin-and-cricketer-mithaliraj-met-jp-nadda

hero-nitin-and-cricketer-mithaliraj-met-jp-nadda

JP Nadda: హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ క్రికెటర్‌ మిథాలీ, నటుడు నితిన్‌ వేర్వేరుగా భేటీ అయ్యారు. నోవాటెల్ హోటల్లో సుమారు గంట పాటు వీరిద్దరితోఆయన చర్చించారు.

మోదీ పాలన పట్ల నితిన్‌, మిథాలీ ఆకర్షితులయ్యారని, ఆయన్ను వ్యక్తిగతంగా కలుసుకునేందుకు ఆసక్తి చూపారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ తెలిపారు.నడ్డా సూచన మేరకు త్వరలోనే ప్రధానితో వీరి భేటీకి ఏర్పాట్లు చేస్తామన్నారు. నడ్డా సూచన మేరకు త్వరలోనే ప్రధానితో వీరి భేటీకి ఏర్పాట్లు చేస్తామన్నారు. నడ్డాతో భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు చెప్పారు.

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ సినిమా, క్రీడా, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులపై దృష్టి సారించింది. గతవారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమయిన సంగతి తెలిసిందే.

Exit mobile version