Site icon Prime9

Rahul Koli: ఆస్కార్ అవార్డుకు ఎంపికైన ‘ఛెల్లో షో’ బాల నటుడు రాహుల్ మృతి

Gujarat child actor Rahul passed away Child Actor

Gujarat child actor Rahul passed away Child Actor

Chellow Show: క్యాన్సర్ తో పోరాడుతున్న గుజరాత్ బాలనటుడు రాహుల్ (10) మృతి చెందాడు. కొన్ని రోజులు క్రితం రాహుల్ క్యాన్సర్ భారిన పడి నేడు తుది శ్వాస విడిచాడు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన బాలనటుడు రాహుల్  ఛెల్లో షోలో నటించాడు. ఇటీవలే ఛల్లో షో ఈ ఏడాది ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ క్రమంలో 10 సంవత్సరాల బాలనటుడు రాహుల్ మృతి చెందడంతో ఆ చిత్ర బృందం విషాదంలో మునిగిపోయింది. అక్టోబరు 2, ఆదివారం అల్పహారం తీసుకొనే సమయంలో వాంతులు చేసుకొన్నాడు. అనంతరం పదే పదే జ్వరం భారిన పడ్డాడు. వైద్యుల పరిక్షల్లో రాహుల్ కు క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు.

రాహుల్ నటించిన ఛెల్లో షో సినిమాను సెమీ బయోగ్రఫీ భాగంలో చిత్రీకరించారు. 95వ ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్ర విభాగంలో భారతదేశం నుండి ప్రవేశం పొందిన చిత్రంలో ఆరుగురు బాల నటులలో రాహుల్ ఒకడుగా నటించాడు. ఛెల్లో షో సినిమా అక్టోబర్ 14న విడుదల కానుంది. ఈ సినిమాలో మృతి చెందిన రాహుల్ అంత్యక్రియలను కూడా  ఛెల్లో షోలో చూపించనున్నారు.

గ్రామీణ గుజరాత్‌లో దక్షిణ ప్రాంతంలోని మారుమూల గ్రామీణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం తొమ్మిదేళ్ల బాలుడు సినిమాతో జీవితకాల ప్రేమ వ్యవహారాన్ని ప్రారంభించిన కధ ఆధారంగా చిత్రాన్ని చిత్రీకరించారు. యూఎస్ఏ, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ దేశాల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.

ఇది కూడా చదవండి:  సౌత్ ఇండియా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ’పుష్ప‘ జోరు

Exit mobile version