NTR 30 : ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఆయన చేసే నెక్స్ట్ సినిమాపై అభిమనులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు కొరటాల – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కెరియర్ పరంగా ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ ఫిక్స్ అవ్వగా.. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
కాగా రీసెంట్ గా హైదరాబాద్ లో మొదలెట్టిన తాజా షెడ్యూల్ షూటింగులో జాన్వీ కపూర్ జాయిన్ అయింది. అయితే గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ 30లో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందులో సైఫ్ విలన్ రోల్ చేస్తాడని కూడా అంటున్నారు. కానీ ఇన్ని రోజులు దీనిపై చిత్రయూనిట్ స్పందించలేదు. తాజాగా ఎన్టీఆర్ 30 చిత్రయూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. సైఫ్ అలీఖాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడంటూ సెట్ లో ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, కొరటాల శివ ఉన్న ఫోటోలను రిలీజ్ చేశారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియా ని షేక్ చేస్తున్నాయి.
Team #NTR30 welcomes #SaifAliKhan on board ❤🔥
The National Award winning actor joined the shoot of the high voltage action drama. @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/RB6s2Xh45g
— NTR Arts (@NTRArtsOfficial) April 18, 2023
సైఫ్ ఈ సినిమాలో విలన్ గానా ? లేదా ముఖ్య పాత్రలోనా ?? NTR 30..
అయితే సైఫ్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నారా ? లేదా మరో ముఖ్య పాత్రలో నటించనున్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ప్రస్తుతం షూటింగ్ లో ఎన్టీఆర్, జాన్వీ పాల్గొంటుండగా.. ఇక సైఫ్ అలీఖాన్ కూడా జాయిన్ అవ్వనున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో పలు కీలకమైన సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా సైఫ్ కూడా తెలుగులో చేస్తున్న ఫస్టు మూవీ కూడా ఇదే కావడం మరో విశేషం అని చెప్పాలి. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన పూజా కార్యక్రమంలో కొరటాల శివ ఈ సినిమా గురించి ఓపెనింగ్ మాట్లాడుతూ చాలా మాస్, యాక్షన్, వైలెంట్ గా ఉండబోతుందని చెప్పి సినిమాపై అప్పుడే అంచనాలని పెంచేశాడు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడంతో పాటు ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారని అర్ధమవుతుంది. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీని హీరోయిన్ గా.. స్టార్ హీరో అయిన సైఫ్ ని విలన్ గా తీసుకున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.