Bathukamma Song: ఏడాది విరామం తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరో గా వస్తున్న సినిమా ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ ’. షర్షాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘వీరమ్’ కు ఈ సినిమా రిమేక్ గా వస్తోంది. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో విక్టరీ వెంకటేష్, జగపతి బాబు, పూజా హెగ్డే, షెహనాజ్ గిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
సినిమాపై భారీ హైప్(Bathukamma Song)
రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 21 న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదల అయిన సినిమా టీజర్ , పాటలు సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేశాయి. వెంకటేష్ ముఖ్యమైన రోల్ చేస్తుండటంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘బతుకమ్మ..’ నేపథ్యంలో సాగే ఈ పాట తెగ ఆకట్టుకుంటోంది. పాటలో బతుకమ్మ పండుగ ఉట్టిపడేలా రూపొందించారు. పూజా హెగ్డే దాండియా స్టెప్స్ తో అదరగొట్టింది. భూమిక,వెంకటేష్ కూడా పాటలో ఆడిపాడారు. పాట చివర్లో పంచ కట్టు లో సల్మాన్ ఖాన్ కనిపించడం పాటకే హైలేట్ గా నిలిచింది.
ఈ సినిమాకు రవి బస్రూర్, దేవి ప్రసాద్, హిమేశ్ రేష్మియా లు సంగీతం అందించారు. అయితే ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ తెలుగు వెర్షన్ లోని సాంగ్ ను రిలీజ్ చేశారా? లేదా హిందీ లోనూ తెలుగు సాహిత్యమే ఉంటుందా అనేది క్లారిటీ లేదు.