Prime9

Sagileti Katha Movie : “సగిలేటి కథ” మూవీ నుంచి ‘అట్టా ఎట్టాగా’ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్..

Sagileti Katha Movie : రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంగా రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్ ప్రేక్షకుల నుండి అశేష ఆధరణ పొందడంతోపాటు, విడుదలైన సాంగ్స్ కి కుడా మంచి అప్లాజ్స్ రావడం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ ‘రధన్’  చేతుల మీదుగా సాంగ్ విడుదల చేశారు.

ఈ సినిమాలోని ‘అట్టా ఎట్టాగా’ రెండొవ లిరికల్‌ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ‘రధన్’ డిజిటల్ లాంచ్ చెయ్యగా, చిత్ర యూనిట్ కి విషెష్ తెలియజేసారు. కాగా.. ఈ చిత్రానికి జశ్వంత్ పసుపులేటి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సాంగ్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్  సభ్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కొనసాగుతుండగా.. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

YouTube video player

అట్టా ఎట్టాగా పుట్టేసినావు
నన్నే ఇట్టాగా సంపేస్తున్నావు
సలికాలం సెగరేపే సలిమంటల్లాగా
నాలోన మంటేట్టినావే
ఇసుకల్లో నడిచొచ్చే ఓంటే పిల్లలాగా
నీదారే నాదంటూ దాహం తీర్చావే..!! అంటూ చక్కటి మెలోడీ అందించిన ఈ గీతాన్ని రాజశేఖర్ సుద్మూన్, జశ్వంత్ పసుపులేటి రాశారు.

ఈ సాంగ్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ తెలుపుతున్నారు. అలాగే, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు సెరవేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar