Site icon Prime9

Arjun Kapoor: షూటింగ్‌లో ప్రమాదం – హీరో అర్జున్‌ కపూర్‌, నిర్మాత జాకీ భగ్నానికి గాయాలు

Arjun Kapoor and Jackky Bhagnani Injured: బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌, హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్త, నిర్మాత జాకీ భగ్నానీ గాయపడ్డారు. షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో వీరిద్దరు గాయపడ్డారు. కాగా అర్జున్‌ కపూర్‌ ప్రస్తుతం ‘మేరే హస్బెండ్‌కి బీవీ’ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ముంబైలో జరుగుతుంది. ఈ క్రమలో నిన్న జరిగిన మూవీ షూటింగ్‌లో సెట్‌లో ప్రమాదం జరిగింది. జనవరి 18వ తేదీన సెట్‌లో సీలింగ్‌ కూలిపోవడంతో ప్రమాదం జరిగినట్టు మూవీ టీం పేర్కొంది.

అదృష్టవశాత్తూ సెట్‌లో ఎవరికీ గాయాలు గాయాలేదని మూవీ టీం స్పష్టం చేసింది. ఈ సంఘటనపై ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ అధ్యక్షుడు తివారీ స్పందిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం, కానీ తీవ్ర గాయాలు జరగలేదని వెల్లడించారు. “షూటింగ్ జరుగుతున్న సమయంలో సీలింగ్‌ కూలిపోండంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కొందరికి గాయాలు అయ్యాయి. హీరో అర్జున్‌ కపూర్‌, నిర్మాత జాకీ భగ్నానీకి స్వల్ప గాయాలు అయ్యాయి. నిర్వాహణ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత భద్రత కారణాల వల్ల సినిమా షూటింగ్‌ని నిలిపివేశాం” అని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version