Manmohan Singh: ఈ దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది – మన్మోహన్‌సింగ్‌ మృతికి చిరంజీవి సంతాపం

  • Written By:
  • Updated On - December 27, 2024 / 03:08 PM IST

Pawan Kalyan and Chiranjeevi Pays Tribute to Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ (92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్య గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ వంటి ప్రముఖులు ఎక్స్‌ వేదికగా ఆయన సంతాపం తెలిపారు.

“మన దేశంలో గొప్ప రాజనీతిజ్ఞులలో మన్మోహన్‌సిగ్‌ ఒకరు. ఉన్నత విద్యావంతులు, అత్యంత మృదుస్వభావి ఆయన. ఆర్థిక మంత్రిగా ఆయన దార్శనికత దేశానికి ఎంతో ఉపయోగపడింది. వరుసగా రెండు పర్యాయాలుగా భారతదేశానికి ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే మార్పులు తెచ్చారు. అలాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంట్‌ సభ్యుడిగా, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా, ఆయన మరణం మన దేశానికి తీరని నష్టం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!!” అని పేర్కొన్నారు.

“గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల ఆర్తికవేత్త పద్మవిభూషణ్‌ మన్మోహన్‌ సింగ్‌ మృతికి భారతదేశం మొత్తం సంతాపం తెలుపుతుంది. ఆయన నాయకత్వం దేశ గమనాన్నే మార్చేసింది. ఆర్థికమంత్రిగా ఎల్‌పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఈ ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం వంటి ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇవి ఎంతోమంది జీవితాలను మార్చాయి. ఆయన ఉన్న జ్ఞానం, చిత్తశుద్ధి, ప్రజా సేవ చేయాలనే అంకిత భావం ఆయన్ని గొప్ప వ్యక్తిగా మార్చాయి. ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. మన్మోహన్‌సింగ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా” అని పవన్‌ కళ్యాణ్‌ రాసుకొచ్చారు.

అలాగే ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, ఉలగనాయకన్‌ కమల్‌ హాసన్‌లు కూడా నివాళులు అర్పించారు. భారతదేశం ఒక గొప్ప పండితుడిని కోల్పోయింది. మన్మోహన్ సింగ్‌ మరణం భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దూరదృష్టితో కూడిన ఆర్థిక, సామాజిక విధానాలతో దేశాన్ని పునర్నిర్మించారు. దేశాన్ని ఈ స్థాయిలో ప్రభావితం చేసినవారు చాలా తక్కువ. అందులో ఆయన ఒకరు. దేశ ఆర్థిక, ప్రధాన మంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ తీసుకున్న నిర్ణయాలు లక్షలాది మందికి ఉపయోగపడ్డాయి. సామాజిక న్యాంపై లోతైన నిబద్దత కలిగిన పాలన అందించారు” అని కమల్‌ హాసన్‌ రాసుకొచ్చారు.