Site icon Prime9

Anchor Anasuya : రాజకీయాల్లో ఎంట్రీపై నోరు విప్పిన యాంకర్ అనసూయ.. ఏమందంటే ?

anchor anasuya shocking comments on political entry

anchor anasuya shocking comments on political entry

Anchor Anasuya : బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో రంగమత్తగా నటించి మెప్పించింది. ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలతో బిజీ అయిపొయింది. చిన్న చిన్న పాత్రలతో పాటు ప్రధాన పాత్రల్లోనూ నటిస్తుంది అనసూయ. ఇక తాజాగా రజాకార్ సినిమాలను నటించింది అనసూయ. ఈ సినిమాను బీజీపీ నాయకుడు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుంచి తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో రాజకీయాల్లో ఎంట్రీ గురించి నోరు విప్పింది అనసూయ. దాంతో అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా సోషల్ మీడియాలో అనసూయ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి తోడు ఈ చిత్ర నిర్మాత కూడా రాజకీయాలకు సంబంధం ఉన్న వ్యక్తి కావడంతో ఈ ఈవెంట్‌లో అనసూయకు ఇదే ప్రశ్న ఎదురైంది.

ఈ నేపథ్యంలో అనసూయని కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా, రాజకీయాల్లోకి వచ్చి ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఏదైనా పార్టీ మిమ్మల్ని ఆహ్వానించిందా అని అడిగారు. దీనిపై అనసూయ సమాధానమిస్తూ.. రాజకీయం నా వాళ్ళ కాదు. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అయినా ఏమన్నా చేయాలంటే బయట ఉండి కూడా ఉద్దరించొచ్చు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేయనిద్దాం. నేను బయట ఉండే చాలా చేస్తున్నాను, మీకు కూడా తెలుసు అని చెప్పింది. ఇక ఏ పార్టీ వాళ్ళైనా ఆహ్వానించారా, ఈ సినిమా నిర్మాత బీజేపీ నేత కదా అని అడగగా.. నన్ను ఏ పార్టీ వాళ్ళు పిలవలేదు. సినిమా నిర్మాతకు, నాకు మధ్య అసలు రాజకీయాల ప్రస్తావనే రాలేదు అని చెప్పింది అనసూయ. మొత్తానికి అనసూయకి పాలిటిక్స్ లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదని క్లారిటీ ఇచ్చింది.

Exit mobile version