Site icon Prime9

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 నుండి న్యూ అప్డేట్ .. ప్రస్తుతం షూటింగ్ స్పాట్ ఎక్కడంటే ..

allu-arjuns pushpa 2 new update

allu-arjuns pushpa 2 new update

Allu Arjun : టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీ గ వున్నారు . ఈ సినిమా గురించి అంతా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప మానియా ఆవరించింది. పుష్ప-2 టీజర్ విడుదలతో నెట్టింట పుష్పరాజ్ పేరు హోరెత్తుతుంది. ఎటు చూసిన పుష్ప పుష్ప.. వేర్ ఈజ్ పుష్ప నేమ్‌ అండ్ సీన్స్‌ నెట్టింట వీరంగం సృష్టిస్తున్నాయి.వచ్చే సంవత్సరం ఆగస్టు 15 ఈ సినిమా రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా అల్లు అర్జున్ మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన ‘మంగళవారం’ సినిమా నవంబర్ 17న రిలీజ్ కానుంది.

తాజాగా నిన్న నవంబర్ 11న మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా రావడంతో చాలా మంది ఫ్యాన్స్ కూడా వచ్చారు. ఫ్యాన్స్ పుష్ప 2 సినిమా గురించి అడగడంతో బన్నీ మంగళవారం సినిమా గురించి మాట్లాడిన తర్వాత పుష్ప అప్డేట్ ఇచ్చారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను పుష్ప షూట్ నుంచే వచ్చాను. రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. లాస్ట్ టైం రిలీజ్ చేసిన జాతర పోస్టర్ చూసారు కదా, ఆ జాతర షూట్ జరుగుతుంది. అందుకే చేతులకు ఇంకా నెయిల్ పాలిష్, పసుపు ఉన్నాయి. మీరు ఊహించిన దానికన్నా మించి ఉంటుంది పుష్ప 2. ప్రస్తుతానికి ఇదే అప్డేట్. సినిమా రిలీజయ్యాక మీరే చూస్తారు అని చెప్పారు.

ఇంతకముందు రిలీస్ చేసిన పోస్టర్ గురించి తెలుసుగా అప్పటిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది . ఆ ఫోటోనే అందరికీ కిక్కిచ్చింది అనే చెప్పాలి. ఉగ్ర రూప దారి అయిన రాయలసీమలో కొలువై ఉన్న గంగమ్మ రూపంలోకి మారిన పుష్పరాజ్ అవతారం. పట్టు చీర కట్టుకుని, ముక్కు పుడక, బుట్ట కమ్మలు, చేతికి ఎర్రపు రంగు గాజులు, మెడలో బంగారు హారాలు, నిమ్మకాయలు, పూల దండలతో, ఎర్రగా మారిన కళ్లతో గంభీరంగా ఉండే గంగమ్మలా పుష్పరాజ్‌ ఈ ఫోటోలో కనిపించారు. ఇందంతా ఒకెత్తయితే ఉగ్రరూప అవతారంలో ఉన్న బన్నీ ఓ చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉండడం మరింత అటెన్షన్ ను గ్రాప్ చేస్తుంది. దీని వల్ల పుష్ప 2 పై అంచనాలు అమాంత పెరిగిపోయాయి . అయితే అల్లు అర్జున్ ఈ సినిమా గురించి కొత్త అప్డేట్ ఇవ్వడంపై బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version