Site icon Prime9

Allu Arjun: ‘మా నాన్న ముందే చెప్పారు’.. వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్ మెంట్ పై బన్నీ కామెంట్స్

Allu Arjun

Allu Arjun

Allu Arjun: మెగా హీరో వరుణ్‌ తేజ్‌, నటి లావణ్య త్రిపాఠి నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటి కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రేమ జంట నిశ్చితార్థ వేడుకను అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థాన్ని ఉద్దేశిస్తూ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఓ సరదా వీడియో షేర్‌ చేశారు. ఇలా జరుగుతుందని తన తండ్రి అల్లు అరవింద్‌ ముందే చెప్పారని పేర్కొంటూ ఫన్నీ ఎమోజీలను అటాచ్‌ చేశారు.

 

 

 

వీడియోలో ఏముందంటే?(Allu Arjun)

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా 2021లో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరించారు. కాగా, ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో లావణ్య చక్కగా తెలుగులో మాట్లాడటంతో అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎక్కడో నార్త్‌ ఇండియా నుంచి వచ్చి తెలుగు బాగా నేర్చుకుని మాట్లాడేస్తుంది. ఇక్కడే ఓ కుర్రాడిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిపోతే బాగుంటుంది కదా ఈ అమ్మాయి’ అంటూ ఆరోజు ఆయన స్టేజ్‌పై చెప్పారు. వరుణ్‌ , లావణ్య నిశ్చితార్థమైన సందర్భంగా ఆ నాటి వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే వీడియోను ఇన్‌స్టా వేదికగా బన్నీ షేర్‌ చేశాడు. తన తండ్రి తెలివైన వారని, లావణ్య తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటుందని ముందే చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది.

 

 

Exit mobile version