Allu Arjun: సంధ్య థియేటర్‌ ఘటన – రేవతి కుటంబానికి అల్లు అర్జున్‌ భారీ ఆర్థిక సాయం

  • Written By:
  • Updated On - December 25, 2024 / 04:25 PM IST

Allu Arjun Huge Finacial Help to Revathi Family: సంధ్య థియేటర్‌ ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి హీరో అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌లు భారీ విరాళం ఇచ్చారు. ఆయన తరపున తాజాగా అల్లు అరవింద్‌ రేవతి కుటుంబానికి చెక్‌ అందజేశారు. కాగా ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు తాజాగా నిర్మాత అల్లు అరవింద్, దిల్‌ రాజు, డైరెక్టర్‌ సుకుమార్‌ వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీతేజ్‌ ఆరోగ్యం పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా శ్రేతేజ్‌ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్‌ తరపున అల్లు అరవింద్‌ రూ. కోటీ అందజేశారు. అలాగే డైరెక్టర్‌ సుకుమార్‌ కూడా రూ. 50 లక్షలు ఇచ్చారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా ఇప్పటికే రూ. 50 లక్షల చెక్‌ అందించిన సంగతి తెలిసిందే. దీంతో నేడు ఆస్పత్రిలో శ్రేతేజ్‌ కుటుంబానికి అల్లు అర్జున్‌ కోటీ రూపాలయ చెక్‌తో పాటు సుకుమార్‌ రూ.50లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ రూ. 50లక్షలు ఇలా మొత్తం రూ. 2 కోట్ల చెక్‌ను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్ రాజుకు ఈ చెక్‌ను అందజేశారు.

అనంతరం అల్లు అరవింద్‌ మీడియాతో మాట్లాడారు. “ఈ విపత్త తర్వాత శ్రేతేజ్‌ కాస్తా కోలుకుంటున్నాడు. వెంటిలేషన్‌ తీసేశారు. శ్రేతేజ్‌ త్వరగా కోలుకోని మనందరితో కలిసి తిరుగుతాడని ఆశిస్తున్నారు. ఈ కుటుంబానికి మా తరపు నుంచి రూ. 2 కోట్ల చెక్‌ను అందించాం. అల్లు అర్జున్‌ రూ.కోటీ, మైత్రీ మూవీ మేకర్స్‌ తరపు రూ. 50 లక్షలు, సుకుమార్‌ రూ. 50 లక్షలు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న దిల్‌ రాజు గారికి ఈ చెక్‌లను అందజేస్తున్నాం. రెండు రోజుల క్రితమే మైత్రీకి వారు అందజేశారు. ఇప్పుడు అల్లు అర్జున్‌, సుకుమార్‌ చెక్‌ను అందజేస్తున్నాం” అని అల్లు అరవింద్ తెలిపారు.

కాగా పుష్ప 2 మూవీ రిలీజ్‌ సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ సినిమా చూసేందుకు అక్కడికి రావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రేతేజ్‌ విషమ పరిస్థితిలో కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుత మొన్నటి వరకు వెంటిలెటర్‌పై చికిత్స పొందిన శ్రేతేజ్‌ ప్రస్తుతం వెంటిలెటర్‌ తీసేశారు. ప్రస్తుతం అతడు స్వయంగా గాలి ఊపిరి పీల్చుకుంటున్నాడు.