Site icon Prime9

Pushpa 2 : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్.. అసలు పుష్ప ఎక్కడ?

allu arjun pushpa 2 glimpse released and got viral on media

allu arjun pushpa 2 glimpse released and got viral on media

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప – 2 “.  2021 లో రిలీజ్ అయిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతి నాయకులుగా కనిపించగా.. సెకండ్ పార్ట్ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కి దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ సాంగ్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్ దాదాపు 350 కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో ఈ పార్ట్ ని తగ్గేదే లే అనే రేంజ్ లో నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి రెండు గిఫ్ట్ లు ఇచ్చింది మూవీ యూనిట్. ముందుగా ఈరోజు నేషనల్ క్రష్ రష్మిక పుట్టిన రోజు సందర్భంగా.. ఈ చిత్రం నుంచి శ్రీవల్లి లేటేస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక కాసేపటి క్రితం ఈ సినిమా సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో మెయిన్ గా గమనిస్తే.. అసలు పుష్ప ఎక్కడ? అనే ప్రశ్న చుట్టూ అల్లుకున్నట్లు కనబడుతుంది. మొత్తానికి ఫ్యాన్స్ అందరికీ ఫుల్ క్రేజీగా అనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 

పుష్ప (Pushpa 2) మిస్పింగ్‌, పుష్ప ఎక్కడ..?

ఇక వీడియో గమనిస్తే.. ‘తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అసలు పుష్ప ఎక్కడ ?’ అంటూ వాయిస్ వినిపిస్తుండగా.. ఇందులో తిరుపతి జైల్‌ నుంచి(2004) బుల్లెట్‌ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. పుష్ప ఎక్కడ అంటూ టీవీ యాంకర్ల బ్యాక్‌ గ్రౌండ్‌ వాయిస్‌తో ఈ వీడియో ప్రారంభమైంది. ఇందులో ఓ బైక్‌పై పుష్ప తప్పించుకుని పోతున్నట్టు చూపించారు. ఇందులో పుష్ప కోసం జనాలు నిరసనలు తెలియజేస్తుండగా, వారిని పోలీసులు చెదరగొడుతుండటం వీడియోలో చూపించింది. పుష్ప మిస్పింగ్‌, పుష్ప ఎక్కడ అనేది ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. దీనిపై క్లారిటీ ఏప్రిల్ 7న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదలై రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ సినిమాతో బన్నీ, రష్మిక క్రేజ్ మారిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది. దీంతో పుష్ప సెకండ్ పార్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

 

Exit mobile version