Site icon Prime9

Allu Arjun : సంథింగ్ స్పెషల్ ఏంటో రివీల్ చేసిన అల్లు అర్జున్.. వైరల్ గా మారిన పుష్ప 2 వీడియో

allu arjun post on instagram goes viral on social media

allu arjun post on instagram goes viral on social media

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ.. పక్కా ఊర మాస్ పాత్రలో అదరగొట్టారు. దీంతో దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్ కు ఫాలోయింగ్ పెరిగిపోయి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

పార్ట్-1 రిలీజ్ అయ్యి దాదాపు రెండేళ్లు పూర్తి అవ్వుతున్నాయి. ఇక ఇటీవల ఈ మూవీకి గాను జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ (Allu Arjun) బెస్ట్ యాక్టర్ అవార్డుని, దేవిశ్రీప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని అందుకున్నారు. దీంతో సీక్వెల్ పై మరింత క్రేజ్ పెరిగింది. కాగా పార్ట్ 1 మ్యూజిక్ కి నేషనల్ అవార్డు రావడంతో సెకండ్ పార్ట్ సాంగ్స్ పై కూడా అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అయితే అల్లు అర్జున్ నిన్న సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేశాడు. “రేపు ఉదయం 9 గంటలకు సంథింగ్ స్పెషల్” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురు చూశారు.

తాజాగా బన్నీ ఆ స్పెషల్ పోస్ట్ ని షేర్ చేశాడు. మార్నింగ్ తన డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి పుష్ప 2 సెట్స్ లో షూటింగ్, ఆ లొకేషన్స్.. ఆ వీడియోలో చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో.. అల్లు అర్జున్ మార్నింగ్ తన డే స్టార్ట్ చేయడం దగ్గర్నుంచి.. సాయంత్రం వరకు ఏమేం చేస్తారనే చూపించారు. ముందుగా ఇంట్లోని గార్డెన్ లో యోగ చేయడం.. ఆ తర్వాత ఉదయం రోజు తన పిల్లలతో వీడియో కాల్ మాట్లాడటం.. అక్కడి నుంచి పుష్ప సెట్ కు వెళ్లడం.. షూటింగ్‏లో పాల్గొనడం చూపించారు. అలాగే ఆ వీడియోలో పుష్ప షూటింగ్ సెట్ లొకేషన్స్, హీరో క్యాస్టూమ్స్, కేరవాన్, ప్రాపర్టీస్ అన్నింటిని చూపిస్తూ.. డైరెక్టర్ సుకుమార్ తో ముచ్చటించారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

 

Exit mobile version