Allu Arjun: చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు చేరుకున్న అల్లు అర్జున్

  • Written By:
  • Updated On - December 24, 2024 / 11:12 AM IST

Police Notice to Allu Arjun: సినీ హీరో అల్లు అర్జున్‌ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆయనను పోలీసులు లోపలికి తీసుకువెళ్తున్నారు. సంధ్య థియేటర్‌ ఘటనలో సోమవారం చిక్కడపల్లి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు(డిసెంబర్‌ 24) ఉదయం 11 గంటలకు పోలీసుల విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు అందిన నేపథ్యంలో అల్లు అర్జున్‌ మంగళవారం ఉదయంపోలీసుల విచారణకు హాజరు అయ్యారు. అల్లు అర్జున్ తో ఆయన తండ్రి అల్లు అరవింద్, మామయ్య చంద్రశేఖర్ రెడ్డిలు ఉన్నారు.

కాగా తొక్కిసలాట ఘటనకు సంబంధించిన పోలీసులు ఓ వీడియో రిలీజ్‌ చేసిన సంగతి తెలితెలిసిందే. దీనిపై అల్లు అర్జున్‌ని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల తర్వాత ఆయన పెట్టిన ప్రెస్‌మీట్‌పై కూడా పోలీసులు విచారించనున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్‌ విచారణకు వస్తున్న నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా సంధ్య థియేటర్‌ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌ మారింది. ఈ ఘటన అల్లు అర్జున్‌ అర్జున్‌ అరెస్ట్‌తో పోలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. ఈ వ్యవహరంలో సినీ ఇండస్ట్రీలో తీరుపై సీఎం రేవంత్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అరెస్ట్‌ అయ్యి ఒక్క పూట జైలుకు వెళ్లిన అతన్ని ఇండస్ట్రీలో మొత్తం ఇంటికి వెళ్తి పరామర్శించింది.. అదే ఘటనలో మరణించిన రేవతి, ప్రాణప్రాయ స్థితిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను ఏ ఒక్కరైన పరామర్శించారా? మానవత్వం అంటే ఇదేనా? అంటూ అసెంబ్లీలో ధ్వజమెత్తారు.

థియేటర్‌కి అనుమతి లేకుండ అల్లు అర్జున్‌ వచ్చారని, ఆయన వస్తున్నట్టు ముందస్తు సమాచారం లేదన్నారు. ఆయన సైలెంట్‌ సినిమా చూసి వెళ్లిపోతే ఈ ఘటన జరిగి ఉండేది కాదేమో.. కానీ, ర్యాలీ రావడం వల్ల అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఆయన ఆరోపణలను అల్లు అర్జున్‌ ఖండించిన సంగతి తెలిసిందే. తన క్యారెక్టర్‌ కించపరచడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ తర్వాత ఈ అంశం మరింత చర్చనీయాంశమైంది. ఇందులో పోలీసులు స్పందిస్తూ అల్లు అర్జున్‌ వీడియో రిలీజ్‌ చేయగా అది సంచలనంగా మారింది.