Site icon Prime9

Allu Arjun : మరోసారి కలిసిన అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్.. అఫిషియల్ అనౌన్స్ !

allu arjun and trivikram srinivas join hands for another movie

allu arjun and trivikram srinivas join hands for another movie

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు వరుస సినిమాల్లో నటిస్తూ సినిమా సినిమాకి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ.. పక్కా ఊర మాస్ పాత్రలో అదరగొట్టారు. దీంతో దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్ కు ఫాలోయింగ్ పెరిగిపోయి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ తరుణం లోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, పలువురు డైరెక్టర్లతో త్వరలోనే ఉండబోతుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు గత కొద్దిరోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఆ ఊహాగానాలు అన్నింటినీ నిజం చేస్తూ అభిమానులకు అదిరిపోయే అనౌన్స్ మెంట్ ఇచ్చారు. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

 

 

హ్యాట్రిక్ హిట్ ల తర్వాత.. మళ్ళీ వస్తున్న బన్నీ – త్రివిక్రమ్ కాంబో..

అల్లు అర్జున్ (Allu Arjun), త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి‘, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి‘, ‘అలా వైకుంఠపురములో‘ ఈ మూడు సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. ఒకదానికి మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు నెలకొల్పాయి. ఇక చివరగా వచ్చిన ‘అలవైకుంఠపురంలో‘ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో వీరి కాంబోలో రాబోతున్న సినిమాపై భారీ అంచనలఉ నెలకొన్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version