Site icon Prime9

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ @ 20 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రి..

leading-man-of-the-year-gq-moty-2022 award goes to Allu Arjun

leading-man-of-the-year-gq-moty-2022 award goes to Allu Arjun

కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడు, నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రి లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు బన్నీ. ఆ తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. 2003లో కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో అల్లు అర్జున్ కు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక అల్లు అర్జున్ స్టైల్ కి, డాన్స్ కి ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. తన స్టైల్ తో కుర్ర కారును ఆకట్టుకొని స్టైలిష్ స్టార్ గా పేరుపొందాడు అల్లు అర్జున్.

ఆ తర్వాత ఆర్య, బన్ని, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య 2 ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించారు. వరుస హిట్లతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో.

ఇక ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ.. పక్కా ఊర మాస్ పాత్రలో అదరగొట్టారు. దీంతో దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్ కు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సిక్వెల్ చేస్తున్నారు బన్నీ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే బన్నీ.. సినీరంగంలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు హృదయపూర్వక నోట్ షేర్ చేశారు.

ఆ నోట్ లో .. “ఈరోజుతో నటుడిగా నేను చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. మీ ప్రేమ.. ఆశీర్వాదాలు ఎప్పుడూ నా వెంటే ఉన్నాయి. ఇండస్ట్రీలో నన్ను అభిమానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రేక్షకుల ప్రేమకు రుణపడి ఉంటాను. ఎప్పటికీ నేను మీకు కృతజ్ఞుడినే ” అంటూ ట్వీట్ చేశారు బన్నీ. దీంతో అల్లు అర్జున్‏కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.

 

ఇక మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ‘దేశముదురు’ కూడా రీరిలీజ్ కు రెడీ అవుతోంది. గత కొన్నాళ్ల నుండి హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను వారి పుట్టిన రోజు నాడు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త టెక్నికల్ హంగులు అద్దుతున్నట్లు సమాచారం.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బన్నీ కెరీర్ కు ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. ఈ సినిమాతోనే హన్సిక మోత్వాని తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీకి దివంగత సంగీత దర్శకుడు చక్రీ అదిరిపోయే సంగీతం అందించారు. ప్రస్తుతం బన్నీ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version