Site icon Prime9

Akira Nandan : అందరికీ షాక్ ఇస్తూ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్..

akira nandan turned as music director with writers block short film

akira nandan turned as music director with writers block short film

Akira Nandan : పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ – రేణు దేశాయ్ త‌న‌యుడుగా అకీరా నంద‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది ప‌వ‌న్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్ప‌టికే న‌ట‌న‌, మార్షల్ ఆర్ట్స్ లాంటి పలు కళల్లో శిక్ష‌ణ తీసుకున్నాడు అకిరా. అకీరాకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. అకిరాకు సొంతగా సోషల్ మీడియా అకౌంట్ లేకపోయినా రేణు దేశాయ్..  అకిరా గురించి అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అకిరా కూడా హీరోగా ఎంట్రీ ఇస్తాడని పవన్ అభిమానులు భావిస్తున్నారు. కానీ సడెన్ గా అకిరా మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తి అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు.

తాజాగా అకిరా నందన్ సంగీత దర్శకత్వం వహించిన ఓ షార్ట్ ఫిలిం రిలీజయింది. ఒక రచయితకు సంబంధించిన కథాంశంతో కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వంలో రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిలిం తెరకెక్కింది. ఈ సినిమాలో మనోజ్ అనే యువకుడు నటించాడు. ఈ షార్ట్ ఫిలింకు అకిరా నందన్ మ్యూజిక్ అందించాడు. నాలుగున్నర నిముషాలు ఉన్న ఈ షార్ట్ ఫిలింకు అకిరా అందించిన మ్యూజిక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు, నెటిజన్లు అకిరా నందన్ పై ప్రశంసలు కురిపిస్తూ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోతో అకీరాలో సంగీతం ట్యాలెంట్ కూడా ఇంత ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ షార్ట్ ఫిలింను షేర్ చేస్తూ అడివి శేష్ వీరికి అభినందనలు తెలిపారు. మరి అకిరా నందన్ భవిష్యత్తులో మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా  ? లేక మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో లాగా ఎంట్రీ ఇస్తాడా అనేది తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు.

అకిరా నందన్ పియానో వాయిస్తాడని, సంగీతంలో పలు విభాగాలు నేర్చుకున్నాడని అందరికి తెలుసు. రేణు దేశాయ్ అప్పుడప్పుడు అకిరా పియానో ప్లే చేసే వీడియోల్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవల అకిరా పుట్టిన రోజు నాడు కూడా పియానో వాయిస్తున్న ఓ వీడియోని షేర్ చేసి అకిరా సంగీతం వినిపిస్తుంటే బాగుంటుంది అని తెలిపింది. గతంలో అకిరా తన స్కూల్ ఈవెంట్ లో ఆర్ఆర్ఆర్ సినిమా లోని దోస్తీ పాటకు పియానో వాయించగా అది వైరల్ అయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు క్రిష్ తో చేస్తున్న హరిహర వీరమల్లు, సుజిత్ తో #OG, సాయి తేజ్ తో కలిసి చేస్తున్న వినోదాయ సిత్తం, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఉన్నాయి. కాగా రాజకీయాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి పవన్ ఇప్పుడు ఈ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల సాయి తేజ్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

Exit mobile version