Site icon Prime9

Adipurush: శ్రీరామ నవమి గిఫ్ట్.. ఆదిపురుష్ నుంచి అదిరిపోయిన అప్డేట్

adi purush

adi purush

Adipurush: ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా.. చిత్ర యూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అదిరిపోయిన అప్డేట్.. (Adipurush)

ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా.. చిత్ర యూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమా నుండి అప్డెట్ కొరకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

శ్రీరామ నవమి సందర్భంగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. సరికొత్త పోస్టర్‌ తో సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.

అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని రామాయణం ఆధారంగా తెరకెక్కించారు.

తాజాగా ఈ సినిమాను జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో కళ్లు చెదిరే గ్రాఫిక్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ ఇదివరకే విడుదలైంది.

కానీ దానికి మిశ్రమ స్పందన దక్కింది. దీంతో వీఎఫ్ఎక్స్ పనులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి మరికొంత సమయం తీసుకుంది చిత్ర యూనిట్.

ఇక ఈ పోస్టర్ లో సీతా సమేత శ్రీరాముడిగా ప్రభాస్ లుక్ అదిరింది. ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫోటోకు ప్రతిరూపంగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు.

సీతా, లక్ష్మణ సమేత శ్రీరాముడికి హనుమాన్ దండం పెడుతున్న పోస్టర్‌ను ఆదిపురుష్ మూవీ టీమ్ రిలీజ్ చేసింది.

రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్‌దత్తా నాగే ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు.

Exit mobile version