Site icon Prime9

Adipurush Poster: విల్లు ఎక్కుపెట్టిన రాముడిలా ప్ర‌భాస్ లుక్ అదిరింది !

prabhas 2 prime9news

prabhas 2 prime9news

Adipurush Teaser Poster: టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌ గా ఎదిగి వ‌రుస కొత్త ప్రాజెక్టులతో అటు అభిమానుల దృష్టిని ఇటు సినీ ప్రేక్షకులను ఆక‌ర్షిస్తోన్న హీరో ప్ర‌భాస్‌.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘ఆది పురుష్’ సినిమా ఒకటి.. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహించగా…టి.సిరీస్ బ్యాన‌ర్‌పై భూష‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు.ఈ సినిమా మొదలుపెట్టిన రోజు నుంచి రోజు రోజుకు అంచ‌నాల‌ను పెంచుకుంటూ వెళ్తుంది.ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌య్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి.వ‌చ్చే ఏడాది 2023 జ‌న‌వ‌రి 12న ఈ సినిమాను విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు ఎప్పుడో ప్ర‌క‌టించేశారు.ఐతే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి చిన్న అప్‌డేట్ కూడా లేదని ప్రభాస్ అభిమానులు బాధ‌ప‌డుతున్నారు.

‘ఆది పురుష్’ సినిమా టీమ్ త‌మ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు శ్రీకారం చూట్టనున్నారని తెలిసిన సమాచారం.ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న ఈ సినిమా టీజ‌ర్‌ ను రామ జన్మభూమి ఐనా అయోధ్యలో విడుద‌ల చేయనున్నారని ప్ర‌క‌టించ‌టంతో అభిమానులకు ఆనందానికి అవధులు లేవు..ఇప్పటి నుంచే సంబ‌రాలు చేసుకుంటున్నారు. వీరి ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ తాజాగా ‘ఆది పురుష్’ సినిమా నుంచి టీజ‌ర్ పోస్ట‌ర్‌ను సినిమా యూనిట్ విడుద‌ల చేసింది. విల్లు ఎక్కుపెట్టిన రాముడిలా ప్ర‌భాస్ లుక్ చూసి మా బాహుబలి రాముని అవతారంలో ఎంత బావున్నారో అని అభిమానులు, నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version