Site icon Prime9

Adipurush : ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిలా కాదు.. కర్ణుడులా ఉన్నాడు – నటి కస్తూరి

actress kasturi comments on prabhas look from adipurush

actress kasturi comments on prabhas look from adipurush

Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “ఆదిపురుష్“. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తుండగా.. బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది. సుమారు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. హిందూ ఇతిహాసంలోని రాముడి కథతో వస్తున్న సినిమా కావడంతో ప్రశంసలు, విమర్శలు ఎదురు అవుతున్నాయి. ఇక ఈ సినిమాకి టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి వివాదాలు వస్తూనే ఉంటున్నాయి.

ఈ క్రమంలోనే ట్రైలర్ తో ఆ వివాదాలన్నింటికి చెక్ పడగా.. మళ్ళీ ఇటీవల రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. పలువురు ప్రముఖులు ఈ (Adipurush) సినిమాపై పెదవి విరుస్తూ స్పందించడం మనం గమనించవచ్చు. ఇప్పుడు తాజాగా  సీనియర్ నటి కస్తూరి సినిమాలో ప్రభాస్ లుక్ పై కామెంట్స్ చేస్తూ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో..  “ఏ ట్రెడిషన్ లో శ్రీరామ లక్ష్మణులకు మీసాలు, గడ్డలు చూపించారు. ఎందుకు రామలక్ష్మణులను ఇలా చూపిస్తున్నారు. ప్రభాస్ సొంత ఇండస్ట్రీలో ఎంతో గొప్ప లెజెండ్స్ శ్రీరామ పాత్రలను చాలా చక్కగా చేశారు. కానీ ఇప్పుడు ప్రభాస్ ని చూస్తుంటే నాకు రాముడు గుర్తుకు రావడం లేదు కర్ణుడు గుర్తుకు వస్తున్నాడు” అంటూ ట్వీట్ చేశాడు.

ఇక కస్తూరి చేసిన ట్వీట్ పై ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. రాముడు కథని నేటి తరానికి తెలిపేలా ప్రభాస్ ప్రయత్నిస్తుంటే విమర్శిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎంత వరకు పోతుందో అని..

 

Exit mobile version