Site icon Prime9

Suman: నా పై వచ్చిన వార్తలు నిజాలు కావంటున్న హీరో సుమన్

suman prime9news

suman prime9news

Suman : తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరో లిస్టులో ఉన్న నటుడు హీరో సుమన్‌ అంటే తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగలేదని, హాస్పిటల్లో చేరరాని ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.కొన్ని యూట్యూబ్‌ చానల్స్‌ ఐతే మరి దారుణంగా ఆయన ఇక లేరంటూ ఇలా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఆయన సుమన్ అభిమానులు బాధ పడుతున్నారు.ఆయన సినీమాల్లో తన పని తాను చేసుకుంటుంటే మీరు ఇలా నిజాలు తెలుసుకోకుండా మీ ఇస్టం వచ్చినట్టు పోస్టులు, వీడియోలు పెట్టి ఆయన్ని ఇంకా క్రుంగదియకండి. మంచిగా ఉన్న వారి పై ఇలా చెప్తుంటే ఇది నిజమా ? కదా ? అని రెండు రాష్ట్రాల అభిమానులు బాధ పడుతున్నారు. ఈ వార్తలు ఎట్టకేలకు సుమన్ చెవిన పడ్డాయి. వెంటనే ఆయన స్పదించారు.

సుమన్ ఆ వార్తలన్నీ తెలుసుకొని వెంటనే మీడియా ముందుకు వచ్చి ” నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, నా గురించి మీరు ఆందోళన పడకండి అంటూ ఆరోగ్యం పైన వస్తున్న రూమర్స్ పై ఎలాంటి నిజాలు లేవని అవి అన్ని వట్టి రాతలే అని కొట్టిపారేశారు నా ఆరోగ్యం చాలా బావుంది నేను షూటింగ్స్ కి రోజు వెళ్ళి వస్తున్నానని ప్రస్తుతం నా సినిమా షూటింగ్ బెంగుళూరులో జరుగుతుందని ,ఈ వార్త నా స్నేహితుల నుంచి తెలుసుకున్నానని దాని వల్ల నేను మీడియా ముందుకు వచ్చానని ” వెల్లడించారు. ఇంకో సారి నా పై ఇలాంటి పిచ్చి వీడియోలు వేస్తె వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని పరువు నష్టం దావా కూడా వేస్తానని తెలిపారు.

Exit mobile version