Site icon Prime9

Actor Navdeep : మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన నవదీప్.. ఏం చెప్పారంటే ??

actor navdeep attends for dugs case enquiry

actor navdeep attends for dugs case enquiry

Actor Navdeep : డ్రగ్స్ కేసు ఉదంతం ఎప్పుడు తెరపైకి వచ్చినా అందులో నటుడు నవదీప్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల మాధాపూర్ డ్రగ్స్ కేసులో కూడా ఆయన పేరు ప్రస్తావనకి రావడం.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, పలు వార్తలు తెర పైకి వచ్చాయి. కాగా ఈ నెల 19వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు తీరడంతో నవదీప్ నివాసంలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో మరో పిటిషన్ ను దాఖలు చేయగా.. తెలంగాణ హైకోర్టు దాన్ని కొట్టివేసింది. 41 ఏ సెక్షన్ కింద నవదీప్ నకు నోటీసు ఇవ్వాలని ఆదేశించింది.

ఈ మేరకు ఈరోజు నవదీప్ విచారణకు హాజరయ్యారు.  నార్కోటిక్ బ్యూరో అధికారులు దాదాపు 6 గంటల పాటు విచారించారు. అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు అద్భుతమైన టీమ్ ను ఏర్పాటు చేశారని..  తెలంగాణ నార్కో విభాగం అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉందని నవదీప్ తెలిపారు.  కొంత సమాచారం తెలుసుకునేందుకు రావాలని నోటీసు ఇచ్చారని..  అందుకే వచ్చానని వెల్లడించారు.

గతంలో తనపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు సిట్, ఎక్సైజ్ విచారణకు సహకరించానని నవదీప్ గుర్తుచేశారు. ప్రస్తుతం ఏడేళ్ల పాత ఫోన్ రికార్డులను కూడా పరిశీలించి దర్యాప్తు చేశారని చెప్పారు. బీపీఎం క్లబ్‌తో వున్న సంబంధాలపై ఆరా తీశారని.. విశాఖకు చెందిన రామచందర్‌తో తనకు పదేళ్ల నుంచి పరిచయం ఉందన్నారు. కానీ తాను ఎలాంటి డ్రగ్స్ కొనుగోలు చేయలేదని.. ఎప్పుడూ , ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని నవదీప్ స్పష్టం చేశారు. అవసరం వుంటే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు. కాగా నార్కోటిక్ బ్యూరో అధికారులు నవదీప్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

 

 

Exit mobile version