Site icon Prime9

Actor Manobala: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

Actor Manobala

Actor Manobala

Actor Manobala: తమిళ సినీ రంగంలో విషాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్య నటుడు, దర్శకుడు మనోబాల (69) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత రెండు వారాలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. కాగా, మనోబాల మృతి తమిళ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

 

తెలుగు ప్రేక్షకులకు చేరువై(Actor Manobala)

తమిళ ఇండస్ట్రీలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా మనోబాల రాణించారు. ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచతమే. మనోబాల నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి డబ్బింగ్‌ అవడంతో ఇక్కడ అభిమానులకు చేరువయ్యారు. తెలుగులో ఆయన మహానటి, దేవదాసు, రాజ్‌దూత్‌, వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో న్యాయమూర్తిగా కనిపించారు మనోబాల.

 

350 సినిమాల్లో నటుడిగా(Actor Manobala)

1970ల్లో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మనోబాల.. 1979లో భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత 20కి పైగా చిత్రాలకు దర్శకుడిగా తెరకెక్కించారు. 3 చిత్రాలకు నిర్మాతగా పనిచేశారు. దాదాపు 350 సినిమాల్లో సహాయ నటుడిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు. స్టార్ నటులు కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించారు. పలు సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా మనోబాల చేరువయ్యారు.

 

 

Exit mobile version