Site icon Prime9

Shahrukh Khan : షారుఖ్ బర్త్ డే వేడుకల్లో 30 ఫోన్లు మాయం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

30 phones robbed by thiefs at shahrukh khan birthday celebrations

30 phones robbed by thiefs at shahrukh khan birthday celebrations

Shahrukh Khan : బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కి దేశ వ్యాప్తంగా కోట్లలో మంది అభిమానులు ఉన్నారు. ఇక ఆయన సినిమా రిలీజ్ అయినా, బర్త్ డే అయినా ఫ్యాన్స్ అందరికీ ఓ పండుగ అని చెప్పాలి. షారుఖ్ ఖాన్ 59వ బర్త్ డే జరుపుకున్నారు. నవంబర్ 2న ఆయన 58 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పెద్ద సంఖ్యలో ఆయన నివాసం ముందు అభిమానులు గుమిగూడి షారుఖ్ ఖాన్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఊహించని ఘటన చోటు చేసుకుంది.

‘మన్నత్’ భారీ సంఖ్యలో ప్రజలు చేరడంతో ఇదే మంచి తరుణం అనుకున్న దొంగలు తమ చేతులకు పని చెప్పారు. గుమి గూడిన జనాల నుంచి ఏకంగా 30కి పైగా సెల్ ఫోన్లు కొట్టేశారు. ఆ తర్వాత ఫోన్లు పోయిన విషయాన్ని తెలుసుకుని షారుఖ్ అభిమానులు షాక్ కు గురయ్యారు. పెద్ద మొత్తంలో సెల్ ఫోన్ల దొంగతనం జరగడం పట్ల పోలీసులు అలెర్ట్ అయ్యారు. బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక ఆ రోజు తనకు బర్త్ డే విషెస్ చెప్పిన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇంత రాత్రి సమయంలో వచ్చి నాకు శుభాకాంక్షలు చెప్పడం.. ఏటా వచ్చే అభిమానుల సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది. ఇంత మంది అభిమానులను సంపాదించుకోవడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలని చెప్పారు. ఇక అదే విధంగా షారుఖ్ – దర్శకుడు రాజ్‌ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘డుంకీ’ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన గత సినిమాలు ‘పఠాన్’, ‘జవాన్’ అద్భుత విజయాన్ని అందుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Exit mobile version