King Nagarjuna : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నాగ్ ఇటీవల నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోవడంతో.. చేయబోయే మూవీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. నాగార్జున నటించిన రీసెంట్ మూవీ ‘ఘోస్ట్’ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికి.. కలెక్షన్లలో జోరు చూపించలేకపోయింది. ఈ క్రమంలోనే నాగ్ తన నెక్ట్స్ మూవీని ‘ధమాకా’ రైటర్ ప్రసన్న కుమార్ డైరెక్షన్‌లో చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది.
నాగార్జునకి (King Nagarjuna) జోడీగా 2020 మిస్ ఇండియా..
2020 మిస్ ఇండియా మానస వారణాసి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు నాగ్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ వంటి ఇద్దరు యంగ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతున్నారట. ఈ సినిమాను 2019లో వచ్చిన ఓ మలయాళ సూపర్ హిట్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మలయాళంలో తెరకెక్కిన ‘పొరిన్జు మరియమ్ జోస్’ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను పట్టుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమాలోని కథను కొద్దిగా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో తమ అభిమాన హీరో ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని అక్కినేని అభిమానులు ఆశగా చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను త్వరలోనే వెల్లడించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలోనే నాగార్జున తన 100 సినిమాను కూడా లైన్లో పెడుతున్నారని సమాచారం. ఈ సినిమాకి దర్శకుడిగా మోహన్ రాజాను తీసుకున్నాడని అంటున్నారు. ఇటీవల చిరంజీవి చేసిన ‘గాడ్ ఫాదర్’ సినిమాకి మోహన్ రాజానే దర్శకుడు. ఆయన టేకింగ్ నచ్చడం వలన నాగార్జున ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. త్వరలోనే ఇతర వివరాలు తెలియనున్నాయి.
మరోవైపు అక్కినేని యంగ్ హీరో అఖిల్ – ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా సాక్షి వైద్య జంటగా నటిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి యూనిట్ వరుసగా అప్డేట్స్ అయితే అందిస్తున్నారు. వరుస ఫ్లాప్ లతో ఉన్న అఖిల్ కు చివరిగా ‘మోస్ట్ ఎలిబుల్ బ్యాచిలర్’తో డీసెంట్ హిట్ దక్కింది. మలయాళ స్టార్ యాక్టర్ మమ్ముట్టీ కీలక పాత్రను షోషిస్తున్న విషయం తెలిసిందే. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/