Site icon Prime9

TSPSC Group-3: తెలంగాణలో గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల.. 1365 పోస్టుల భర్తీ

TSPSC group-3 notification

TSPSC group-3 notification

TSPSC Group-3:  తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ వచ్చేసింది. తాజాగా గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ పచ్చజెండా ఊపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1365 పోస్టులను భర్తీ చేయనుంది.

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ నుంచి వరుస ఉద్యోగ ప్రకటనలు వస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. తాజాగా గ్రూప్-3 నోటిఫికేషన్ ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 24వ తేదీన ప్రారంభం కానుండగా.. దరఖాస్తుకు ఫిబ్రవరి 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 107 విభాగాల్లోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భార్తీ చేస్తున్నారు.

tspsc-group3 notification

ఇక ఇప్పటికే హాస్ట‌ల్ వార్డెన్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. హార్టిక‌ల్చ‌ర్, వెట‌ర్న‌రీ శాఖ‌ల్లో కూడా ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. ఇంకోవైపు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క్రియ కొన‌సాగిస్తోంది. పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో భాగంగా ఫిజిక‌ల్ ఈవెంట్స్ కొన‌సాగుతున్నాయి. మొత్తంగా తెలంగాణ‌లో కొలువుల జాత‌ర కొన‌సాగుతోందనే చెప్పాలి.

ఇదీ చదవండి: తెలంగాణ విద్యార్దులకు గుడ్ న్యూస్.. ఇంటర్ తోనే ఐటీ జాబ్స్

Exit mobile version