Site icon Prime9

Anganwadi Supervisor Recruitment: మహిళలకు మాత్రమే.. అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుకు అప్లికేషన్ ప్రక్రియ షురూ

GOVT JOB prime9 news

GOVT JOB prime9 news

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ. తాజాగా 181 అంగన్వాడీ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా 08-08-2022 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలయ్యింది. అర్హత గల మహిళా అభ్యర్థులు సెప్టెంబరు 29లోగా ఈ పోస్టుల కోసం అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకునేందుకు మొదటగా తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ నెంబరు, పుట్టిన తేది వివరాలు నమోదుచేసుకుని మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా నిర్దారించాలి.

జోన్లవారీగా ఖాళీలు: ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్లో కాళేశ్వరం-26, బాసర-27, రాజన్న సిరిసిల్ల-29, భద్రాద్రి-26, యాదాద్రి-21, చార్మినార్-21, జోగుళాంబ-31 ఖాళీలు ఉన్నట్టు మహిళాశిశు సంక్షేమ శాఖ తెలిపింది.

విద్యార్హత: హోంసైన్స్/సోషల్ వర్క్/సోషియాలజీ/ఫుడ్ సైన్స్ & న్యూట్రీషన్/ ఫుడ్ & న్యూట్రీషన్/బోటనీ/జువాలజీ & కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ/అప్లైడ్ న్యూట్రీషన్ & పబ్లిక్ హెల్త్/ క్లినికల్ న్యూట్రీషన్ & డైటేటిక్స్/ ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్/బయోలాజికల్ కెమిస్ట్రీ/ఫుడ్ సైన్సెస్ & మేనేజ్‌మెంట్/ఫుడ్ టెక్నాలజీ & న్యూట్రీషన్/ఫుడ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొనింది.

వయోపరిమితి: 01.07.2022 నాటికి అభ్యర్థులకు 18-44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3, ఎన్సీసీ అభ్యర్థులకు 3, ఎస్సీ-ఎస్టీ-బీసీ-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుందని వెల్లడించింది.

దరఖాస్తు ఫీజు: ఈ పోస్టుకు అప్లై చేసుకునేందుకు రూ.280 పీజు ఉంటుంది. ఇందులో రూ.200 అప్లికేషన్ ప్రాసెసింగ్ కు కాగా, రూ.80 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. నిరుద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పరీక్ష ఫీజు ఉండదు. రాత పరీక్ష విధానం ద్వారా పోస్టుల భర్తీ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను చూడగలరు.

మరికొన్ని జాబ్ వార్తల కోసం క్లిక్ చెయ్యండి

ఇదీ చదవండి: SBI Recruitment 2022: నిరుద్యోగులకు ఎస్‌బీఐ శుభవార్త.. 5008 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Exit mobile version