Site icon Prime9

Police Jobs: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీ

AP Police Recruitment 2022 for 6511 police jobs

AP Police Recruitment 2022 for 6511 police jobs

Police Jobs: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలోని 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి చర్యలు మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. పోలీస్ నియామక ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ఆయన అధికారులకు సూచించారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనున్నట్లు అధికారవర్గాలు చెప్తున్నాయి. డిసెంబర్ లో ఈ నియామకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాతపరీక్ష, ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు సమాచారం.  ఎస్‌ఐ పోస్టులకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. కానిస్టేబుల్‌ పోస్టులకు ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులయ్యి ఉండాలి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

మొత్తం ఖాళీల వివరాలు 6,511
1. సివిల్ ఎస్సై పోస్టులు – 387
2. ఏపీఎస్పీ ఎస్సై పోస్టులు – 96
3. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు – 3508
4. ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు -2520

ఇదీ చదవండి: ఏపీలో 560 అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ

 

Exit mobile version