Site icon Prime9

JEE-2023: జేఈఈ 2023 పరీక్ష తేదీలు మేము ఇవ్వలేదు.. అది ఫేక్‌ నోటీస్‌- ఎన్టీఏ

jee-main-2023-notification-dates-registration-is-fake-says-nta-official

jee-main-2023-notification-dates-registration-is-fake-says-nta-official

JEE-2023: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్స్) 2023 పరీక్షపై ఇటీవల పలు రాకాల తేదీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం విధితమే. కాగా జేఈఈ పరీక్ష తేదీల విషయంలో విద్యార్థులు కన్ప్యూజ్ అవుతున్న తరుణంలో ఈ వార్తలపై ఎన్టీఏ స్పందించింది. తొలి విడత పరీక్ష వచ్చే జనవరిలో, తుది విడత ఏప్రిల్‌లో నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నట్లు వస్తోన్న వార్తలపై నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం స్పష్టత నిచ్చింది.

జేఈఈ మెయిన్‌ 2023 పరీక్షకు సంబంధించి తాము ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదని వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతున్న నోటీస్‌ ఫేక్‌ అని ఎన్‌టీఏ డీజీ వినీత్‌ జోషీ స్పష్టం చేశారు. విద్యార్ధులు అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేయాలని, ఇటువంటి నకిళీ వార్తలను నమ్మిమోసపోవద్దని ఆయన సూచించారు. సదరు ఫేక్‌ నోటీస్‌ ప్రకారం.. జేఈఈ మెయిన్‌ తొలి విడత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నవంబర్‌లో ప్రారంభమవుతుందని, డిసెంబర్‌ 31 నాటికి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొంది. ఇక దీనికి సంబంధించిన పరీక్ష జనవరి 18 నుంచి 23 వరకు జరుగుతాయని, సెషన్‌-2 పరీక్ష ఏప్రిల్‌ 4 నుంచి 9 వరకు జరగనుందని ఎన్‌టీఏ పేరుతో నెట్టింట ఫేక్ నోటీస్ ప్రచారం అవుతుంది.

ఇదీ చదవండి: ఇంటర్ లో ఇకపై కొత్త సిలబస్

Exit mobile version