Intermediate: తెలంగాణలో ఇంటర్మీడియట్ సిలబస్ మారనుంది. వచ్చే విద్యాసంవత్సరంలోపు కొత్త సిలబస్ అందుబాటులోకి రానున్నది. శుక్రవారం నిర్వహించిన ఇంటర్ బోర్డు సమావేశంలో ఈ మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. సిలబస్ మార్పు, కొత్త సిలబస్ ఖరారుకు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. నూతన సిలబస్ రూపకల్పనకు సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీలను వేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం నిర్ణయించింది.
ఇప్పటికే తెలుగు, ఇంగ్లిష్ సిలబస్‌ను మార్చారు. తాజాగా మిగతా సబ్జెక్టుల్లో కొత్త సిలబస్ తీసుకురానున్నారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్, ఓయూ వీసీ డీ రవీందర్, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను ముందే అందజేయాలని అధికారులు నిర్ణయించారు. ఏటా పుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యం ఏర్పుడుతుందని తెలిపింది, వచ్చే విద్యాసంవత్సరం కోసం పుస్తకాల ముద్రణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వారు తెలిపారు.
ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్‌బోర్డు ఏటా జారీచేసే అనుబంధ గుర్తింపును విద్యాసంవత్సరం మధ్య వరకు పొడిగించకుండా మే నెలాఖరు కల్లా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాలతోతో నడుస్తున్న కాలేజీలకు ఒకటి లేదా రెండింటికి మాత్రమే అనుమతి ఉంటున్నదని మంత్రి సబిత తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యాలు ఆయా భవనాలను మార్చాలని సూచించారు.
ఇదీ చదవండి: కేంద్రంతో తమ అనుబంధం రాజకీయాలకు అతీతం.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు