IIT JEE Result 2022: ఐఐటీ- జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశానికి గాను గత నెల 28న పరీక్షలు నిర్వహించగా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే నేడు ఫలితాలను విడుదల చేసింది.
అభ్యర్థుల తుది ఫలితాలు jeeadv.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, విద్యార్థులు తమ స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ బాంబే వెల్లడించింది. ఈ పరీక్షకు 1,60,038 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా, 1,55,538 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని, 40,712 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని తెలిపింది.
కాగా ఈ ఫలితాల్లో 360 మార్కులకు గాను 314 మార్కులు సాధించి ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ఆర్కే శిశిర్ ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచాడు. అదే సమయంలో 360 మార్కులకు 277 మార్కులు సాధించి ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన తనిష్క కబ్రా మహిళల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి: బస్తీ, పల్లె దవాఖానాల్లో భారీగా ఖాళీలు.. 1569 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల