Site icon Prime9

PM Modi: మోదీ దీపావళి గిఫ్ట్.. 75వేల మందికి ఆఫర్ లెటర్స్..!

Modi diwali gift to youngsters 75000 offer letters

Modi diwali gift to youngsters 75000 offer letters

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ యువతకు దీపావళి సందర్భంగా భారీ కానుకను ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు జాబ్‌ ఆఫర్‌ లెటర్స్‌ మోదీ అందజేయనున్నారు.

అలాగే దీపావళికి రెండు రోజుల ముందు అనగా శనివారం వారితో వర్చువల్‌గా సమావేశమై వివిధ అంశాలపై మోదీ వారితో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగానే వారికి అదే రోజు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ 75వేల మంది యువతకు పలు ప్రభుత్వ విభాగాల్లో మరియు వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ప్రధాని స్పెషల్‌ గిఫ్ట్‌ అందుకునే యువతకు.. రక్షణ, రైల్వే, హోం, కార్మిక, ఉపాధి శాఖలు, తపాలా విభాగం, సీఐఎస్‌ఎఫ్‌, సీబీఐ, కస్టమ్స్‌, బ్యాంకింగ్‌ వంటి రంగాల్లో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి: ఎంత దారుణం.. ప్లాస్మాకు బదులుగా బత్తాయిరసం ఎక్కించారు

Exit mobile version
Skip to toolbar