Central Govt Jobs: 10 పూర్తి చేసిన నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోసుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సశస్త్ర సీమ బల్ (SSB) 2022 ఏడాదికి గాను తాత్కాలిక ప్రాతిపదికన స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తిగల పురుష, మహిళా అభ్యర్థుల నుంచి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీ డైరెక్టరేట్ జనరల్ అప్లికేషన్లను స్వీకరించనుంది. దీని ద్వారా 399 పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదోతరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే కేంద్రం నిర్దేశించిన క్రీడా ఈవెంట్ల అయిన ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాడీ బిల్డింగ్, బాక్సింగ్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, షూటింగ్, సెపక్ తక్రా, స్విమ్మింగ్, తైక్వాండో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు, వాటర్ స్పోర్ట్స్, యాచింగ్ వంటి క్రీడల్లో పాల్గొని ఉండాలి. అభ్యర్థులకు 18-23 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. క్రీడా సర్టిఫికేట్స్, రాత పరీక్ష, ఫీల్డ్ ట్రయల్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర ప్రక్రియల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా సేవలు అందించాల్సి ఉంటుంది. అన్ని పరీక్షల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు రూ.21700 – రూ.69100 జీతం ఇవ్వనుంది.
దరఖాస్తు ఫీజు రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతరత్రా పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను http://www.ssbrectt.gov.in/ సంప్రదించండి.
ఇదీ చదవండి:బూట్లతో కాదు చెప్పులే.. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో కఠిన నిబంధనలు