Site icon Prime9

APPSC: గ్రూప్-4 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయ్

APPSC

APPSC

APPSC: గ్రూప్-4 ప్రిలిమ్స్ ఫలితాలొచ్చేశాయ్. ఇటీవల ఏపీలో గ్రూప్-4 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖ‌లో ఖాళీగా ఉన్న జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీ కోసం నిర్వ‌హించిన ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప్రిలిమ్స్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను ఏపీపీఎస్సీ బుధ‌వారం రాత్రి విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష‌ను జులై 31న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వ‌హించిన సంగ‌తి విదితమే.

కాగా ఈ గ్రూప్-4 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు మొత్తం 2,11,341 మంది అభ్య‌ర్థులు హాజ‌రు కాగా మెయిన్ ప‌రీక్ష‌కు 11,574 మంది అర్హ‌త సాధించిన‌ట్లు ఏపీపీఎస్సీ వెల్ల‌డించింది.
అర్హులైన వారి వివ‌రాల‌ను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన‌ట్లు పేర్కొనింది. మెయిన్స్ ప‌రీక్ష‌ తేదీ ఎప్పుడన్న విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.

ఇదీ చదవండి: గ్రూప్-1 పరీక్షల్లో కొత్త మార్పులు.. ఈ సారి అన్నీ జంబ్లింగే..!

Exit mobile version