Site icon Prime9

TTD Free Tickets: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శనం టికెట్లు

ttd to release senior citizens and phc quota free tickets

ttd to release senior citizens and phc quota free tickets

TTD Free Tickets: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఉచిత దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. అక్టోబర్‌ నెలకు సంబంధించిన వృద్ధులు, దివ్యాంగుల కోటా టెకెట్లను ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చేనెల 1 నుంచి 5 వరకు మినహా మిగిలిన రోజులకు భక్తులు ఈ టిక్కెట్లను బుక్‌చేసుకోవడానికి తితిదే అవకాశం కల్పించింది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

ఇకపోతే తిరుమలలో శ్రీవేంకటేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొదటిరోజు శ్రీవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా నేడు సింహ వాహనంపై మలయప్పస్వామి ఊరేగనున్నారు.

ఇదీ చదవండి: తిరుమలలో హంస వాహనంలో ఊరేగిన మలయప్ప స్వామి

Exit mobile version