Site icon Prime9

Tirumala Srivaru: తిరుమలేశుడికి ప్రకృతి సొబగులు

tirumala srivaru

tirumala srivaru

Tirumala Srivaru: అలంకార ప్రియుడిగా పూజలందుకుంటున్న తిరుమలేశుడికి ప్రకృతి దాసోహం అంటుంది. సప్తగిరుల్లో లభ్యమయ్యే ప్రకృతి సిద్ధమైన ఫలపుష్పాలనే కాకుండా దేశ, విదేశాల నుంచి ఫలపుష్పాదులను తెప్పించి స్వామివారిని అలంకరిస్తుంటారు అర్చకస్వాములు. శ్రీవారి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పూటకో అలంకరణ చేస్తారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం నాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయ్యప్ప స్వామికి స్నపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్వామి అమ్మవార్లను వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకిస్తుంటారు. ఇలా స్వామివారిని పూజించడం ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి స్నపన తిరుమంజన సేవల్లో పవిత్రాలు, సజ్జ కంకులతో తయారు చేయించిన కిరీటాలు, మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీవారి అలంకరణలో ఎప్పటికప్పుడు కొత్తదనం కనిపించేలా టీటీడీ ఉద్యానవనశాఖ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలోనే యాలకులు, పట్టువ్రస్తాలు, సజ్జ కంకులు, పవిత్రాలు, ఎండు ద్రాక్ష–రోస్‌ పెటల్స్, వట్టివేర్లు–ముత్యాలు, నల్ల–తెల్లద్రాక్ష, కురువేరు–పసుపు, ఎరుపు పెటల్స్, మల్లె–రోజా మొగ్గలతో స్వామివారికి వివిధ రకాలుగా కిరీటాలు, మాలలు తయారు చేయించి, స్వామివారి తిరుమంజన సేవలో అలంకరించారు. తిరుమలేశుడి ఉత్సవాల్లో స్నపన తిరుమంజనానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజన సేవ చేస్తారు. దీనిలో భాగంగా రంగనాయకుల మండపాన్ని ఫలపుష్పాలతో బహుసుందరంగా అలంకరించారు. ఈ అంలకరణల్లో శ్రీవారు భక్తులను కనువిందు చేశారు.

ఇదీ చదవండి: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శనం టికెట్లు

Exit mobile version