Site icon Prime9

Annavaram: అన్నవరంలో ఇకపై అరిటాకుల్లేవ్.. కంచాల్లోనే అన్నప్రసాదం

annavaram-devasthanam-taken-a-key-decision-annaprasadam-in-plates

annavaram-devasthanam-taken-a-key-decision-annaprasadam-in-plates

Annavaram: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం విరాజిల్లుతోంది. కాగా ఈ ఆలయంలోని సత్యదేవుడి ప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకత గుర్తింపు ఉంది. అలాగే ఇక్కడి అన్నప్రసాదానికి భక్తుల ఆదరణ ఉంది. ఇలాంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సత్యదేవుడి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

నిర్వఘ్నంగా గత 35 ఏళ్లుగా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు దేవస్థానంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతోంది. కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులకు అరిటాకుల్లోనే అన్నప్రసాదం అందించారు.  అయితే, తాజాగా అరిటాకుల్లో కాకుండా కంచాలు (స్టీల్ ప్లేట్స్)లో అన్నవితరణ చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అరిటాకుల స్థానంలో కంచాలు తీసుకురావాలని, నేటి నుంచే అది అమలు చేయాలని దేవాలయ నిర్వహణ కమిటీ పేర్కొనింది.

నానాటికి అరటి సాగు తక్కువగా ఉండడం, అరిటాకుల లభ్యత అంతంత మాత్రమే కావడంతోపాటు ప్రతిరోజు అరిటాకులను కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అని భావించి.. ఖర్చు తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ అధికారులు అంటున్నారు. అలాగే, ఇప్పటి వరకు భక్తులకు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వరుస బంతి పద్దతిలో అన్నవితరణ చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా బఫే పద్ధతిలోనే అన్న ప్రసాద వితరణ చేయనున్నట్టు తెలిపారు. అయితే, దానికి గానూ హాలు సిద్ధం కాకపోవడం, క్యూ లైన్ల పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి బఫే పద్ధతిని వాయిదా వేసినట్టు వెల్లడించారు. ఇకపోతే, భక్తులు తినే కంచాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేందుకు గానూ యంత్రాలను కూడా సిద్ధం చేసినట్టు దేవాలయ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: నాగర్ కర్నూల్ లో మరోమారు మోగిన ఎన్నికల నగారా..!

Exit mobile version