Vijayasai Reddy Counter To YS Jagan:: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల వైసీపీకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా, విజయసాయి రెడ్డి రాజీనామాపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజ్యసభ సభ్యుల్లో విజయసాయిరెడ్డితో కలిసి ఇప్పటివరకు నలుగురు పార్టీని వీడారన్నారు. రాజకీయాల్లో ఉన్న సమయంలో విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలని చెప్పాడు. మనమే ప్రలోభాలకు ఆశపడి లేదా భయాందోళన చెంది రాజీ కుదుర్చుకొని ఇతర పార్టీల వద్దకు వెళ్తే.. హ్యుమానిటీ, విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఏంటీ? అంటూ ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి, మిగతా ముగ్గురు ఎంపీలు లేదా మరో ఇద్దరు పార్టీ మారినా అంతేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ ఇంకా ఉందంటే.. దేవుడి దయతో పాటు ప్రజలు ఆశీస్సులతోనేనని జగన్ అన్నారు.
అయితే, జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విజయసాయి రెడ్డి పోస్ట్ చేశారు. ‘వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని, కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భయం విషయానికొస్తే.. నాలో ఏ అణువు లోనూ లేదు. కావున రాజ్యసభ పదవితో పాటు పార్టీ పదవులు, రాజకీయాలను వదులకున్నా.’ అంటూ ట్వీట్ చేశారు.,