Site icon Prime9

Kidnap: ప్రేమ వివాహం చేసుకుందని కూతురిని కిడ్నాప్ చేసి గుండు కొట్టించారు..

kidnap

kidnap

Jagtial District: తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు ఆమెకు శిరో్మండనం చేయించిన దారుణ ఘటన వెలుగు చూసింది. జగిత్యాల జిల్లా రూరల్ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు, రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత ప్రేమించుకున్నారు. విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పారు. తాము ఒకరినొకరు ఇష్టపడుతున్నామని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డామన్నారు. దీనికి యువతి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. దీనితో వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

దీనిని తట్టుకోలేని అక్షిత తల్లిదండ్రులు ఆమె పట్ల దారుణంగా వ్యవహరించారు. అక్షిత అత్తవారింటికి వచ్చి మారణాయుధాలతో దాడిచేసి తమ కుమార్తెను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. కారులో ఆమెను తీవ్రంగా కొట్టి శిరో ముండనం చేయించారు. మధును వదిలిపెట్టిరావాలంటూ హింసించారు. అయితే ఎన్ని దెబ్బలు తిన్నా అక్షిత మాత్రం తల్లిదండ్రుల మాటలు పట్టించుకోలేదు. వారి ప్రవర్తన పట్ల తీవ్రంగా ప్రతిఘటించింది తనకు కట్టుకున్నోడే కావాలంటూపోలీస్ స్టేషన్ కి చేరింది. జరిగిన ఘాతుకాన్ని వివరించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్ఐ అనిల్ న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆమె భర్తకు ఆమెను అప్పగించామని, ఆమె తల్లిదండ్రుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Exit mobile version