Site icon Prime9

Jammu Kashmir: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

six-died-and-15-injured-after-truck-collaided-with-rtc-bus-in-ups-bahraich

six-died-and-15-injured-after-truck-collaided-with-rtc-bus-in-ups-bahraich

Jammu Kashmir: జమ్మూకశ్మీర్ రాష్ట్రం కిష్త్వార్ జిల్లాలోని మార్వా ప్రాంతంలో బుధవారం రాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్లు వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దాదాపు 8 మంది మృతిచెందారు. అందులో నలుగురు మహిళలు ఉన్నారు.

పోలీసులు స్థానికుల సాయంతో రెస్కూ ఆపరేషన్‌ చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో ఏడుగురు మర్వా ప్రాంతానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల్లో నౌపాచికి చెందిన ఉమర్ గనీ షా, ఛంజెర్‌కు చెందిన మహ్మద్ అమీన్, ఖాదర్నాకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్, తాచ్నాకు చెందిన అఫాక్ అహ్మద్, ఆసియా బానోగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పలువురు నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లు

Exit mobile version