Site icon Prime9

Love Couple Suicide: ప్రేమ జంట ఆత్మహత్య.. శ్రీకాకుళం నుంచి విశాఖ వచ్చి మరీ..!

love couple commit suicide

love couple commit suicide

Love Couple Suicide: విశాఖపట్టణంలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఓ లాడ్జీలో శ్రీకాకుళానికి చెందిన ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రాణంగా ప్రేమించుకున్న తమ పెళ్లికి ఎక్కడ పెద్దలు అంగీకరించరోనన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి చెందిన కందివలస దామోదర్ (20) డిగ్రీ చదువుతుండగా, ఆముదాలవలస మండలంలోని బలగాం గ్రామానికి చెందిన అదపాక సంతోషి కుమారి (17) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నారు. కాగా ఇటీవల వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కాగా సోమవారం మధ్యాహ్నం వీరిద్దరూ విశాఖకు వచ్చి దరిగొల్లపాలెంలోని ఓ లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నారు. అయితే తెల్లారి మధ్యాహ్నం అవుతున్నా గది నుంచి ఇద్దరూ బయటకు రాలేదు. దానితో అనుమానంతో లాడ్జీ సిబ్బంది తలుపుకొట్టగా తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూములోని కిటికీ గది ఊచలకు ఇద్దరూ ఉరేసుకుని కనిపించారు.

ఇదిలా ఉండగా యువతి మెడలో పసుపు తాడును గుర్తించిన పోలీసులు పెళ్లి చేసుకున్న అనంతరమే వీరిరువురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఇద్దరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు వీరిద్దరూ ప్రేమించుకున్న విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడం గమనార్హం. మరోవైపు, తమ పిల్లల మృతి వార్త తెలుసుకున్న ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ఉలిక్కిపడిన గుంటూరు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణ హత్య..!

Exit mobile version