Site icon Prime9

Hawala Rocket: హైదరాబాదులో భారీగా హవాలా సొమ్ము పట్టివేత

Seizure of Hawala money in Hyderabad

Seizure of Hawala money in Hyderabad

Hyderabad: హైదరాబాదు నగరంలో మరో మారు భారీగా హవాలా సొమ్ము పోలీసులకు పట్టుబడింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తనిఖీల చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఈ నగదు పట్టుబడింది.

జుమ్మేరాత్ బజార్ వద్ద దాదాపుగా కోటికి పైగా నగదును తరలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నిందితుల వద్ద పట్టుబడ్డ నగదుకు ఎలాంటి ఆధార పత్రాలు లేకపోవడంతో వారి నుండి కారు, నగదు స్వాధీనం చేసుకొన్నారు. పట్టుబడ్డ వారిలో షాహినాత్ గంజ్ కు చెందిన కమలేశ్, అశోక్ కుమార్, రతన్ సింగ్, గోషామహల్ కు చెందిన రాహులు అగర్వాల్ ఉన్నారు. అధిక సొమ్మును ఆర్జించే క్రమంలో ఈ ముఠా హవాలా తరలింపు మార్గాన్ని ఎంచుకొన్నట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. నగదు ఎవరిచ్చారు. ఎక్కడకు తరలిస్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో స్వాధీనం చేసుకొన్న హవాలా సొమ్ముకు ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: Suicide: పోలీస్ స్టేషన్ లో దంపతులకు ఎస్సై కౌన్సిలింగ్.. అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డ భార్య

Exit mobile version