Site icon Prime9

Pushpa 2: హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. పుష్ప 2 ఆర్టిస్టులకు తీవ్ర గాయాలు

Pushpa 2

Pushpa 2

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప 2: ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగపుకుంటున్నారు. కాగా బుధవారం పుష్ప 2 చిత్రం ఆర్టిస్టుల బస్సు ప్రమాదానికి గురైంది. నార్కట్‌ పల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టిస్టులు వెళ్తున్న బస్సు .. ఆగి ఉన్న తెలంగాణ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఆ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. షూటింగ్‌ ముగించుకొని వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురి అయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో హైదరాబాద్ – విజయవాడ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

 

 

ఫ్యాన్స్ ను థ్రిల్ చేసేందుకు ముందుగానే(Pushpa 2)

పుష్ప 2: ది రూల్.. సుకుమార్, అల్లు అర్జున్‌ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం . రెండేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన పుష్ప చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రష్మిక మందన్నా హీరోయిన్‌. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

తాజా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త చక్కలు కొడుతోంది. చాలా భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది. అయితే, ఇంకా ముందుగానే డిసెంబర్ చివరి వారంలో థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి కి ముందే బన్నీ అభిమానులను థ్రిల్ చేయాలని సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారట.

ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ దక్కంచుకున్న అల్లుఅర్జున్ కి పాన్ వరల్డ్ లో పేరు తీసుకొచ్చేందుకు సుక్కు గట్టిగా ప్లాన్ చేస్తున్నారని టాక్. పుష్ప 2 సినిమాను వరల్డ్ క్లాస్ క్వాలిటీతో నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకే సారి 20 కి పైగా దేశాల్లో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట సుకుమార్.

 

 

Exit mobile version