Prime9

Colombia: ఇంటిపై కూలిన విమానం.. 8 మంది మృతి

Colombia: కొలంబియా దేశంలోని మెడెలిన్ నగరంలోని ఓ ఇంటిపై విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది మరణించారని మెడెలిన్ మేయర్ డేనియల్ క్వింటెరో చెప్పారు.

కొలంబియాలోని రెండవ అతిపెద్ద నగరమైన మెడెలిన్‌లోని నివాస ప్రాంతంలో ఒక చిన్న విమానం కూలిపోయిందని విమానాశ్రయ అధికారులు, మేయర్ తెలిపారు. కొలంబియాలోని ఒలాయా హెర్రెరా విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం ఇంజిన్ వైఫల్యంతో ఓ ఇంటిపై కుప్పకూలి పోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విమానం ఇంటిపై కూలిన తర్వాత దట్టమైన నల్లటి పొగలు గాలిలో కనిపించాయి. విమానంలోని ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో సహా 8 మంది ఉన్నారని. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం విమానం కూలిన ఇంట్లో ఎవరూ గాయపడినట్లు లేదా మరణించినట్లు తెలియలేదు.

ఇదీ చదవండి: 10 గంటల్లో 62 సార్లు.. 162 మంది మృతి

Exit mobile version
Skip to toolbar