Site icon Prime9

Crime News: సూల్క్ లిఫ్ట్‌లో ఇరుక్కుని టీచర్ మృతి

crime news in mumbai

crime news in mumbai

Crime News: పాఠశాల లిఫ్ట్‌ లోపల కాలు, బయట శరీరం ఇరుక్కుని ఒక ఉపాధ్యాయురాలు మరణించింది. ఈ దుర్ఘటన మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో జరిగింది.

ముంబైలోని మలాడ్‌ ప్రాంతంలో ఉన్న సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హై స్కూల్‌లో విషాదం నెలకొంది. ఆ పాఠశాలలో 26 ఏళ్ల జెనెల్ ఫెర్నాండెజ్, టీచర్‌గా పనిచేస్తుంది. కాగా శుక్రవారం మధ్యాహ్నం ఆమె తన క్లాస్ ముగించుకుని ఆరో అంతస్తు నుంచి రెండో అంతస్థులో ఉన్న స్టాఫ్‌ రూమ్‌కు వెళ్లేందుకు లిఫ్ట్‌ వద్దకు వెళ్లింది. కాగా ఆ టీచర్‌ లిఫ్ట్‌లోకి ఒక కాలు పెట్టిన వెంటనే లిఫ్ట్ డోర్లు మూసుకుని పైన ఉన్న ఏడో అంతస్తుకు అది కదిలింది. దానితో లిఫ్ట్‌ డోర్‌ బయట శరీరం, లోపల కాలు చిక్కుకుని ఆమె నలిగిపోయింది. సహాయం కోసం గట్టిగా కేకలు వెయ్యగా.. స్పందించిన మిగతా టీచర్లు, విద్యార్థులు ఆ టీచర్ని రక్షించేందుకు సర్వ ప్రయత్నాలు చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే సమీప ఆసుపత్రి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Chandigarh University: 60 మంది అమ్మాయిల బాత్రూం వీడియోలు లీక్… ఆ యూనివర్సిటీలో హైటెన్షన్

Exit mobile version