Kerala: ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి, వారి మాంసం వండుకుని తిన్న సంఘటన మరువక ముందే క్షుద్ర పూజలకు చిన్నారులను ఉపయోగిస్తున్న మరో వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది.
ఓ మహిళ క్షుద్ర పూజల చేస్తూ అక్కడి స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తుంది. అంతే కాక ఈ పూజలకు పిల్లలను కూడా వినియోగించడంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దానితో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మంత్రగత్తెను అరెస్ట్ చేశారు. పతనంతిట్ట జిల్లాలోని మలయాళపుజా పట్టణానికి చెందిన శోభన అలియాస్ వాసంతి చిన్న పిల్లలను తన ముందు కూర్చోబెట్టి తాంత్రిక కార్యాలు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో ఆ పూజలో పాల్గొన్న ఒక చిన్నారి స్పృహతప్పి పడిపోయింది. దానితో విషయం తెలుసుకున్న స్థానికులు మంత్రగత్తె శోభనకు వ్యతిరేకంగా గురువారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పలుమార్లు ఆమెపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదని ఈ సారి ఆమెను అరెస్ట్ చేసేవరకు ఆందోళనను ఆపేది లేదంటూ భీష్మించుకు కూర్చోవడంతో డీఎస్పీ ఆదేశాలతో మంత్రగత్తె శోభనను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: కేరళ నరబలిలో షాకింగ్ నిజాలు.. బాధితుల మాంసాన్ని వండుకుని తిన్న నిందితులు