Site icon Prime9

Crime News: భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేసిన భార్య.. ఎందుకంటే..?

Mumbai Man Dies Of Slow Poisoning. Cops Find His Wife's Deadly Secret

Mumbai Man Dies Of Slow Poisoning. Cops Find His Wife's Deadly Secret

Crime News: ముంబైలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రియుడితో కలిసి భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేసింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని శాంతాక్రజ్‌కు చెందిన కవిత-కమల్‌కాంత్ భార్యాభర్తలు. భర్తతో విభేదాల కారణంగా అతడి నుంచి దూరంగా వెళ్లిపోయిన కవిత, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత మళ్లీ భర్త వద్దకు వచ్చేసింది.

కమల్‌కాంత్, హితేశ్ జైన్ బాల్యస్నేహితులు. కాగా కొద్దిరోజుల క్రితం కమల్‌కాంత్ తల్లి ఒక రోజు అకస్మాత్తుగా కడుపునొప్పితో బాధపడుతూ మృతి చెందింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కమల్‌కాంత్ కూడా కడుపునొప్పితో బాధపడుతూ ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. దానితో ఆసుపత్రికి వెళ్లిన అతడిని పరీక్షించిన వైద్యులు అతడి రక్తంలో ఆర్సెనిక్, థాలియం స్థాయిలు అధికంగా ఉన్నట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు.

ఈ క్రమంలో బాంబే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబరు 19న కమల్‌కాంత్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానితో విచారణ చేపట్టిన పోలీసులు కవిత, కమల్‌కాంత్ బాల్య స్నేహితుడు హితేశ్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు చెప్పిన మాటలు విని పోలీసులు నిర్ఘాంతపోయారు. హితేశ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత.. భర్త కమల్‌కాంత్‌ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఒక్కసారిగా చంపేస్తే అందరికీ అనుమానం వస్తుందని భావించి, ప్రియుడితో కలిసి భర్త తినే ఆహారంలో కొద్దికొద్దిగా విషం కలుపుతూ వచ్చింది. అది నెమ్మదిగా అతడి మృతికి కారణమైంది. అరెస్ట్ అయిన కవిత, హితేశ్‌లకు కోర్టు ఈ నెల 8 వరకు పోలీసు కస్టడీ విధించింది.

ఇదీ చదవండి: బాలికపై మరో ఇద్దరితో కలిసి బాబాయ్ గ్యాంగ్ రేప్

Exit mobile version