Site icon Prime9

Kochi: దారుణం.. రన్నింగ్ కారులో మోడల్ పై అత్యాచారం

19-year-old-model-gang-raped-in-moving-car-in-kochi

19-year-old-model-gang-raped-in-moving-car-in-kochi

Kochi: కేరళలోని కొచ్చిలో కామాంధులు రెచ్చిపోయారు. రన్నింగ్ కారులో 19 ఏళ్ల మోడల్ పై అత్యాచారానికి ఒడిగట్టారు. గురువారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే కొచ్చిన్ షిప్ యార్డ్ సమీపంలోని ఓ పబ్ లోని పార్టీకి ఓ యువ మోడరల్ వెళ్లింది. అక్కడ ఆమె మద్యం సేవించింది. దీన్ని అవకాశంగా భావించిన కొందరు, ఆమెను కక్కనాడ్ లోని తన నివాసం వద్ద దిగబెడతామని చెప్పి కారులోకి ఎక్కించుకున్నారు. దానిని నమ్మిన ఆ యువతి కారు ఎక్కింది. అంతే ఇంక రాత్రంతా పట్టణం చుట్టూ తిప్పుతూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రూమ్ వద్ద వదిలి పెట్టి వెళ్లిపోయారు.

కాగా బాధిత మోడల్ ను చికిత్స కోసం కలమసెర్రి మెడికల్ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక మహిళ సహా మొత్తం నలుగురి వ్యక్తులను ఎర్నాకుళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి వీణా చార్జ్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. నిందితులపై కఠిన చర్య తీసుకుంటామని ఆమె తెలిపారు.

ఇదీ చదవండి: పుట్టినరోజు వేడుకలో విషాదం.. 21 మంది సజీవదహనం

Exit mobile version
Skip to toolbar