Site icon Prime9

Jharkhand: హృదయ విదారక ఘటన.. తల్లి కళ్లెదుటే కూతురిపై సామూహిక అత్యాచారం

minor girl rape case in eluru district andhra pradesh

minor girl rape case in eluru district andhra pradesh

Jharkhand: మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వావీవరలు విడిచి, మానవత్వం మరచి చిన్నపిల్లల నుంచి పండు ముసలివాళ్లపై మృగాళ్లు దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే మరోకటి వెలుగుచూసింది. ఓ మైన‌ర్‌పై బాలిక‌పై కామంతో కళ్లుమూసుకుపోయిన కొందరు యువకులు విరుచుకుప‌డ్డారు. బాలిక త‌ల్లి ముందే ఆ చిన్నారిపై దారుణానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని దియోఘ‌ర్ జిల్లాలో సోమ‌వారం వెలుగులోకి వచ్చింది.

జార్జండ్ రాష్ట్రం ద‌మ్కా జిల్లాకు చెందిన ఓ త‌ల్లీకూతురు ఓ వేడుకకు హాజరయ్యేందుకు దియోఘ‌ర్‌కు ఆదివారం వెళ్లారు. కాగా వేడుక ముగించుకుని వారిద్ద‌రూ మ‌ళ్లీ ద‌మ్కాలోని త‌మ గ్రామానికి తిరుగుపయనమయ్యారు. అయితే మ‌దుపూర్ ప్రాంతానికి వచ్చేసరికి ఈ త‌ల్లీబిడ్డ‌ల‌ను ఓ ఐదుగురు యువ‌కులు అడ్డుకున్నారు. త‌ల్లి ముందే ఆ చిన్నారిపై కామాంధులు
సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. త‌న కూతుర్ని ఏం చేయొద్దంటూ అడ్డగించిన త‌ల్లిపై విచక్ష‌ణార‌హితంగా దాడి చేశారు.

దానితో బాధితురాలి త‌ల్లి సమీప పోలీసుల‌ను ఆశ్రయించింది. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఐదుగురు నిందితుల్లో ఇద్ద‌ర్ని అదుపులోకి తీసుకోగా మిగ‌తా ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:  నాకు ప్రాణహాని జరిగితే సీఎం జగన్ దే బాధ్యత.. దస్తగిరి

Exit mobile version