Site icon Prime9

Hyderabad: పాతబస్తీలో దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

minor girl rape case in eluru district andhra pradesh

minor girl rape case in eluru district andhra pradesh

Hyderabad: హైదరాబాద్ లో ఏదో ఒక మూలన నిత్యం ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చి, ఎన్ని శిక్షలు వేసినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. పసి పిల్లలని కూడా చూడకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు కామాంధులు. కాగా ఇలాంటి సంఘటనే తాజాగా పాతబస్తీలో వెలుగుచూసింది. ఓ మైనర్ బాలిక పై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్లోని పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ 16 ఏళ్ల బాలిక పై కొందరు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ నెల 12న చంచల్‌గూడ జైలు సమీపంలో మైనర్ బాలికను కిడ్నాప్‌ చేసిన గుర్తు తెలియని యువకుల సమూహం. నాంపల్లిలోని ఓయో లాడ్జ్‌కు తీసుకెళ్లి, ఆమెకు మత్తు మందు ఇచ్చి మరీ రెండు రోజులపాటు తనపై సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. అనంతరం ఆ బాలికను అక్కడే వదిలి వెళ్లిపోయారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డబీర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. నిందితులు బాధితురాలికి తెలిసినవారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: పెళ్లింట విషాదం… నవ దంపతుల ఆత్మహత్యాయత్నం

Exit mobile version